నదుల పునరుజ్జీవమే శాశ్వత చర్య : చంద్రబాబు
MarinaSkies
Kizen

నదుల పునరుజ్జీవమే శాశ్వత చర్య : చంద్రబాబు

13-09-2017

నదుల పునరుజ్జీవమే శాశ్వత చర్య : చంద్రబాబు

నదుల అనుసంధానం తాత్కాలిక చర్య అని నదుల పునరుజ్జీవమే శాశ్వత చర్య అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ నదులంటే అందరికీ భక్తిభావమని, వాటిని పూజించుకోవడం వారసత్వంగా వస్తోందని అన్నారు. రాయలసీమలో 19 నుదులు, కోస్తాలో 20 నదులు ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. భూగర్భజలాలను కాపాడుకోవడానికి వేల చెరువులు తవ్వామని చెప్పారు. భూగర్జ జలాలు 8 మీటర్లకు తేవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ర్యాలీ ఫర్‌ రివర్స్‌ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నదుల సంరక్షణ కార్యక్రమానికి సహకరిస్తామని తెలిపారు.


Click here for PhotoGallery