అమరావతిలో అతి పెద్ద జెయింట్ వీల్
MarinaSkies
Kizen

అమరావతిలో అతి పెద్ద జెయింట్ వీల్

13-09-2017

అమరావతిలో అతి పెద్ద జెయింట్ వీల్

ప్రజా రాజధానిలో బౌద్ధ చక్రం ఆకారంలో అతి పెద్ద జెయింట్ వీల్ ఏర్పాటుకు యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు నేడు ముఖ్యమంత్రితో సమావేశమై అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.439.37 కోట్లతో దీన్ని ఏర్పాటుచేస్తామన్నారు. మూడు దశలలో ఈ నిర్మాణాన్ని చేపడతామని, తొలిదశలో దేశంలోనే అతిపెద్ద జెయింట్ వీల్‌గా, రాష్ట్ర పర్యాటక రంగానికే ప్రధాన ఆకర్షణగా నిర్మిస్తామని యూరో డెస్టినేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘అమరావతి బౌద్ధ చక్ర’గా దీనికి సీఎం ప్రాథమికంగా పేరు పెట్టారు. ఇక్కడే సుందరమైన జల క్రీడల కేంద్రం, ఐదు నక్షత్రాల రిసార్టులు, షాపింగ్ ఎరీనా, బడ్జెట్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఫ్యామిటీ రిక్రియేషన్ జోన్, సోషల్ క్లబ్, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.