ఎన్‌ఆర్‌ఐల పెళ్లిళ్ల నమోదుకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలి
Nela Ticket
Kizen
APEDB

ఎన్‌ఆర్‌ఐల పెళ్లిళ్ల నమోదుకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలి

14-09-2017

ఎన్‌ఆర్‌ఐల పెళ్లిళ్ల నమోదుకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలి

భారత్‌లోని యువతులను పెళ్లి చేసుకునే ప్రవాస భారతీయులు వారిని వదిలేయడం లేదా గృహ హింసలకు, వరకట్నం వేధింపులకు గురికావడం పెరిగిపోతుండడంతో భారత్‌లో ఎన్‌ఆర్‌ఐల పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కూడిన నిపుణుల కమిటీ విదేశాంగ శాఖకు సిఫార్సు చేసింది.  ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు), విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు, భారత సంతతికి చెందిన విదేశీయులు ఆధార్‌ కోసం నమోదు చేసుకోవడానికి సంబంధించి ఒక విధానాన్ని రూపొందించే పనిలో ఆధార్‌కు సంబంధించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది. ప్రస్తుతం భారతీయులు, చెల్లుబాటయ్యే భారతీయ వీసాలు కలిగి ఉన్నవారు అందరూ ఆధార్ సంఖ్యకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, విదేశాల్లో ఉండే నేరస్థులను భారత్‌కు అప్పగించాలని కోరేందుకు ఉపయోగపడే ఒప్పందాలను కూడా సవరించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. గృహ హింసకు పాల్పడే నిందితుడ్ని కూడా అప్పగించడానికి వీలుగా ఈ ఒప్పందాలను సవరించాలని ఆ కమిటీ సూచించింది.