తెలుగు నిబంధనకు ఉపరాష్టప్రతి అభినందన
Nela Ticket
Kizen
APEDB

తెలుగు నిబంధనకు ఉపరాష్టప్రతి అభినందన

14-09-2017

తెలుగు నిబంధనకు ఉపరాష్టప్రతి అభినందన

తెలంగాణ ప్రభుత్వం  మాతృభాష తెలుగుకు ప్రాముఖ్యతనిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అభినందనలు తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తప్పనిసరిగా తెలుగు చదవాలన్న నిబంధనను స్వాగతిస్తూ బుధవారం ఉపరాష్టప్రతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషలతో మాతృభాష తెలుగు ప్రథమంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమలు చేస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.