అద్భుతమైన పుణ్యక్షేత్రంగా భద్రాద్రి
MarinaSkies
Kizen

అద్భుతమైన పుణ్యక్షేత్రంగా భద్రాద్రి

14-09-2017

అద్భుతమైన పుణ్యక్షేత్రంగా భద్రాద్రి

భద్రాచలం ఆలయాన్ని దేశంలోనే అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్టు సిఎం కె చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ప్రస్తుత దేవాలయానికి ఉత్తరం, పడమర వైపునున్న స్థలాలతో కలిపి దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి పర్చడానికి చిన్నజీయర్ స్వామి చేసిన సూచనలకు అనుగుణంగా ఆలయ శిల్పి ఆనంద్‌సాయి బృందం రూపొందించిన దేవాలయ అభివృద్ధి నమూనాలపై ప్రగతి భవన్‌లో బుధవారం మంత్రు లు, అధికారులతో సిఎం చర్చించారు. గోదావరి నది సరిగ్గా భద్రాచలం ఆలయం దగ్గరే మలుపు తిరిగి తూర్పునకు ప్రవహిస్తుందని, కొద్దిదూరం పోయిన తర్వాత ఉత్తర వాహినిగా మారుతుందని సిఎం అన్నారు. శ్రీరామచంద్రుడు కూడా పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు వచ్చి ఇదే ప్రాంతంలో నడియాడాడన్నారు. ఈ కారణాల వల్ల భద్రాది ఆలయానికి ఎంతో స్థల మహత్యం, పౌరాణిక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందన్నా చెప్పారు. భద్రాద్రి ఆలయాన్ని ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా అభివృద్ధి చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.