అంతర్గత శైలి అద్భుతం
Nela Ticket
Kizen
APEDB

అంతర్గత శైలి అద్భుతం

14-09-2017

అంతర్గత శైలి అద్భుతం

నార్మన్ ఫోస్టర్ బృందం అందించిన ఆకృతులపై మంత్రివర్గ సహచరులు, ఇతర ప్రభుత్వ ముఖ్యులతో సమాలోచన చేసి తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. రాజధానిలోని నవ నగరాల్లో ముఖ్యమైన పాలనా నగరానికి సంబంధించి శాసనసభ, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల కార్యస్థాన భవంతుల ఆకృతులు, అంతర్గత నిర్మాణ శైలి ఎలా వుండాలన్న అంశంపై తుది ప్రణాళికలను సిద్ధం చేసిన ఫోస్టర్ బృందంతో ముఖ్యమంత్రి బుధవారం సాయంత్రం సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై కూలంకుశంగా చర్చించారు. వజ్రాకృతిలో శాసనసభ, బౌద్ధ స్థూపం ఆకారంలో హైకోర్టు భవంతులు ఉండాలన్న ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఫోస్టర్ అండ్ పార్టనర్స్ తుది ఆకృతులను రూపొందించారు. వీటిల్లో అంతర్గత నిర్మాణ శైలి బాగుందని, బాహ్య ఆకృతుల విషయంలో మిగిలిన అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.