ఏపీ అభివృద్ధికి సింగపూర్‌ సహకారం
Sailaja Reddy Alluddu

ఏపీ అభివృద్ధికి సింగపూర్‌ సహకారం

12-10-2017

ఏపీ అభివృద్ధికి సింగపూర్‌ సహకారం

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తున్న సింగపూర్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి లోకేష్‌ను సింగపూర్‌ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధి సింగపూర్‌ ప్రతినిధులకు వివరించారు. విశాఖలో అంతర్జాతీయ బ్లాక్‌ చైన్‌ బిజినెస్‌ కాన్ఫరెన్స్‌ విజయవంతం అయ్యిందని లోకేష్‌ను సింగపూర్‌ ప్రతినిధులు అభినందంచారు. ఏపీలో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, నూతన పాలసీలను మంత్రి వివరించారు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ఉపయోగించి ట్యాంపర్‌ ప్రూఫ్‌ ల్యాండ్‌ రికార్డులు రూపొందించే కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు.  బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీలో గ్లోబల్‌ లీడర్‌గా ఎదగాలని అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌కు సింగపూర్‌ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సింగపూర్‌ ప్రతినిధులు తెలిపారు.

ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్ఛరింగ్‌లో లీడర్‌గా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు చీఫ్‌ డిజైన్‌ దగ్గర నుండి ఈ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ వరకూ పూర్తిస్థాయిలో ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ రంగంలో సింగపూర్‌ సహకారం కావాలని మంత్రి కోరారు. ఈ వేస్ట్‌ మేనెజెమెంట్‌లో సింగపూర్‌ పలు ప్రయోగాలు చేసిందని, ఆ టెక్నాలజీ మీకు అందిస్తామని ప్రతినిధులు తెలిపారు.