తెలంగాణ ఉన్నత విద్యామండలిని సందర్శించిన అమెరికా ప్రతినిధులు
Sailaja Reddy Alluddu

తెలంగాణ ఉన్నత విద్యామండలిని సందర్శించిన అమెరికా ప్రతినిధులు

12-10-2017

తెలంగాణ ఉన్నత విద్యామండలిని సందర్శించిన అమెరికా ప్రతినిధులు

అమెరికాకు చెందిన ముగ్గురు ప్రతినిధుల బృందం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని సందర్శించింది. అమెరికాలోని కేంబ్రిడ్జి ఎయిర్‌పోర్ట్‌ బిజినెస్‌ అడ్వయిజరీ మేనేజర్‌ ఎరిక్‌ టేలర్‌, అట్లాంటా ఎయిర్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ సంచాలకుడు ఇల్లియట్‌, ట్రావెల్‌ ఇండస్ట్రీ ఎంగేజ్‌మెంట్‌ ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌ టీజే జాక్సన్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు లింబాద్రి, వెంకటరమణను అడిగి తెలంగాణలో ఉన్నత విద్య వ్యవస్థ పనితీరు గురించి తెలుసుకున్నారు. దాదాపు 50 విశ్వవిద్యాలయాలున్న అట్లాంటా నగరంలో పర్యటించాలని అమెరికా ప్రతినిధులు వారికి సూచించారు.