భారత విద్యార్థులపై అట్లాంట వర్శిటీల ఆసక్తి
Sailaja Reddy Alluddu

భారత విద్యార్థులపై అట్లాంట వర్శిటీల ఆసక్తి

12-10-2017

భారత విద్యార్థులపై అట్లాంట వర్శిటీల ఆసక్తి

అట్లాంటలోని 50 విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థులపై ఆసక్తి చూపుతున్నాయి. తమ వర్శిటీల్లో ఆఫర్ చేస్తున్న కోర్సుల్లో చేరేందుకు , పరస్పర భాగస్వామ్యంగా ఎక్స్చేంజి కార్యక్రమం నిర్వహించేందుకు అట్లాంటా నుండి వచ్చిన ప్రతినిధి బృందం తెలంగాణ ఉన్నత విద్యామండలిని కోరింది. బృందం ప్రతినిధులు ఎరిక్ టైయర్, ఇలియట్ పాయి, టి జె జాక్సన్, శ్రీకాంత్ బొడిగ, సిఎస్ షేక్ సబర్వాల్ తదితరులు బుధవారం నాడు మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, వైస్ చైర్మన్‌లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణలను కలిశారు. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో తాము విద్యాశాఖ అధికారులను కలిసినట్టు వారు చెప్పారు.