ఆరుషి కేసులో సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు
Sailaja Reddy Alluddu

ఆరుషి కేసులో సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు

12-10-2017

ఆరుషి కేసులో సంచలన తీర్పునిచ్చిన హైకోర్టు

ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులను నిర్దోషులుగా అలహాబాద్‌ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సమర్పించడంలో సిబిఐ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఆరుషిని అమె తల్లిదండ్రులే చంపారనడానికి ఆధారాలు లేవని సృష్టం చేసింది. నోయిడాలో 2008లో, మే 16న అరుషి తన పడకగదిలో హత్యకు గురైంది. ఆరుషి హత్యక పనిమనిషి హేమ్‌రాజ్‌ ను ప్రధాన నిందితుడిగా మొదట అనుమానించారు. అయితే ఆరుషి హత్య జరిగిన మరుసటి రోజే హేమ్‌రాజ్‌ తల్వార్‌ అపార్ట్‌మెంట్‌ టెర్రస్‌పై అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. హేమ్‌రాజ్‌, ఆరుషి సన్నిహితంగా ఉండడాన్ని చూసి ఆరుషి తల్లిదండ్రులు వీరిద్దరిని హత్య చేసినట్టు పోలీసులు అనుమానించారు. వారిని అరెస్టు చేశారు. ఈ కేసు వివాదాస్పదం కావడంతో నాటి యుపి సీఎం మాయవతి సిబిఐ విచారణకు అప్పగించారు. అనంతరం పలు మలుపులు తిరిగిన ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా నిర్ధారిస్తూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది.