పశ్చిమ గోదావరి లో అమెరికా బృందం పర్యటన
Sailaja Reddy Alluddu

పశ్చిమ గోదావరి లో అమెరికా బృందం పర్యటన

13-10-2017

పశ్చిమ గోదావరి లో అమెరికా బృందం పర్యటన

ఆధునిక సాంకేతిక హంగులతో అందరినీ ఆకట్టుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ కేంద్రాలు కామన్‌ అప్లికేషన్‌ సిస్టం(సిఎఎస్‌)లో తన ప్రతిభను కనబర్చింది. ఈ విధానాన్ని 95 శాతం పూర్తిచేసి దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. అందులోను పశ్చిమ గోదావరి జిల్లా 99.6 శాతం పూర్తిచేసి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. దీంతో అసలు అనతికాలంలో సిఎఎస్‌ ఏవిధంగా పూర్తిచేయగలిగారో తెలుసుకునేందుకు డిమాగీ అనే ఆర్గనైజేషన్‌కు చెందిన అమెరికా చెందిన జోనాథన్‌ జాక్సన్‌ ప్రతినిధుల బృందం భారత్‌దేశానికి వచ్చింది. ఢిల్లీ రాష్ట్రానికి చెందిన ప్రతినిధులతో పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన ఈ బృందం జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విస్సాకోడేరు ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఉన్న భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు ఆఫీసర్‌ వాణీ విజయరత్నం, అంగన్‌వాడీ టీచర్లు ఏ విధంగా క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి అప్లికేషన్లు పూర్తిచేశారో అడిగి తెలుసుకున్నారు. గృహాన్ని, గర్భిణీ, కుటుంబ సభ్యుల వివరాలను ఏ విధంగా ఐసిడిఎస్‌ డ్యాష్‌ బోర్డుకు అనుసంధానం చేశారో వారు వివరించారు.