కియా ప్లాంటు పరిశీలనకు అమెరికాకు అధికారుల బృందం
Sailaja Reddy Alluddu

కియా ప్లాంటు పరిశీలనకు అమెరికాకు అధికారుల బృందం

13-10-2017

కియా ప్లాంటు పరిశీలనకు అమెరికాకు అధికారుల బృందం

అమెరికాలోని కియా కార్ల తయారీ పరిశ్రమను పరిశీలించి రావడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం వెళ్లింది. దక్షిణ కొరియాకు చెందిన చిన్న కార్ల దిగ్గజ సంస్థ కియా అనంతపురం జిల్లాలో కార్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురం వద్ద నెలకొల్పే ఈ పరిశ్రమ ఆమెరికాలోని జార్జియా నగరంలో ఉన్న కియో మోటర్స్‌ కంపెనీ ఆకృతిలో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ ప్లాంటు ప్రత్యేకతలు పరిశీలించి రావడానికి అధికారుల బృందం ఆ దేశానికి వెళ్లింది.

 ఆంధ్రప్రదేశ్‌  పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఎండీ. ఎ.బాబు, అనంతపురం జిల్లా కలెక్టరు వీరపాండ్యన్‌లు ఈ పర్యటనకు వెళ్లారు. వారు ముందుగా జార్జియాలోని కియా ప్లాంటును పరిశీలించి, దాని ప్రత్యేకతలు అధ్యయనం చేస్తారు. అనంతరం దక్షిణ కొరియాకు వెళ్లి అక్కడ కియా మోటర్స్‌ ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతపురం జిల్లాలో కియాకు ఇవ్వనున్న స్థలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి వివరించి, భూమి ఎప్పుడు అప్పగించేది తెలియజేస్తారు. నిర్మాణ పనులకు సంబంధించి భూమిపూజ తేదీని ఖారారు చేసుకుని రానున్నారు.