పాస్‌పోర్టు దరఖాస్తు మరింత సులభం
Sailaja Reddy Alluddu

పాస్‌పోర్టు దరఖాస్తు మరింత సులభం

13-10-2017

పాస్‌పోర్టు దరఖాస్తు మరింత సులభం

పాస్‌పోర్టు దరఖాస్తు ప్రక్రియ మరింత సరళతరం కానుంది. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో పాటు అద్దె ఇళ్లలో నివాసముండే వారికి పాస్‌పోర్టు అధికారులు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే ఐదేళ్లలోపు  చిన్నారులు, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఇకపై ముందుస్తుగా స్టాట్‌ బుక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. సాధారణ క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. వారు తమ దరఖాస్తులు, సంబంధిత ధృవీకరణ పత్రాలతో నేరుగా వాక్‌ఇన్‌ ఇంటర్వూలకు  వెళ్లిపోవచ్చు. అంతేకాదు వికలాంగులు, ( చేతులు పనిచేయని లేదా కోల్పోయిన వారు), ఐదేళ్ల లోపు చిన్నారులకు వేలిముద్రలను ఇవ్వాల్సిన నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అద్దె ఇళ్లలో ఉండేవారు ప్రూఫ్‌ ఆఫ్‌ అడ్రెస్‌ కింద సంబంధిత అద్దె ఒప్పందాన్ని ఇవ్వవచ్చు.