అమరావతికి ఎమిరేట్స్ కు నేరుగా విమానం వస్తుంది
APEDB
Ramakrishna

అమరావతికి ఎమిరేట్స్ కు నేరుగా విమానం వస్తుంది

22-10-2017

అమరావతికి ఎమిరేట్స్ కు నేరుగా విమానం వస్తుంది

అన్ని ప్రాంతాలను కనెక్ట్ చేస్తున్నాం.. చంద్రబాబు

గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇమ్మిగ్రెంట్స్‌కు మా వంతు కృషిగా చేయగలిగినంత కంటే ఎక్కువ ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నాం

ఇందుకోసమే నేను అధికారంలోకి రాగానే APNRT ని నెలకొల్పాను. గల్ఫ్ లో ఉన్న ఆంధ్రుల సమస్యలను గుర్తించి అధ్యయనం చేయమని కోరాను. వాళ్ల సమస్యల పరిష్కారానికి సూచనలు అడిగాను.

ఇక్కడ నివసించే మనవాళ్లకు సాధికారత కల్పించడం కోసం APNRT సహకారం అందిస్తోంది. మన రాష్ట్రానికి వచ్చినా స్థిరపడాలనుకున్నా, లేదా పనిచేస్తున్న దేశాలలో ఎంటర్ ప్రెన్యూర్లుగా ఎదగడానికైనా APNRT తోడ్పడుతోంది.

మీలో అనేకమంది APNRT తో కలసి పనిచేస్తున్నారు. ఇలా APNRT లో 109 దేశాల నుంచి 45,000 మంది సభ్యులయ్యారు. సమస్యల పరిష్కారానికి, సమస్యల నిరోధానికి APNRT ఒక వేదికగా నిలిచింది.

విదేశాలల్లో ఉన్న మన రాష్ట్రం వారు దురదృష్టవశాత్తూ సమస్యల్లో ఉన్నా, ఆపదల్లో చిక్కుకున్నా వారికి తక్షణ సాయానికి బడ్జెట్ లో రూ.40 కోట్లను కేటాయించాం.

ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్’ పేరుతో 24 గంటలూ సేవలందించే ఒక ‘హెల్ప్ లైన్’ ప్రారంభించాలని APNRTకి సూచించాం.

కేంద్ర, రాష్ట్ర వనరులను ఉపయోగించి సమస్యల్లో చిక్కుకున్న వారిని గుర్తించి సహాయపడటంలో ప్రవాసాంధ్ర హెల్ప్ లైన్ లో పనిచేసే వారికి శిక్షణ అందించాం.