బూర్జ్‌ ఖలీపాను సందర్శించిన సీఎం చంద్రబాబు

బూర్జ్‌ ఖలీపాను సందర్శించిన సీఎం చంద్రబాబు

23-10-2017

బూర్జ్‌ ఖలీపాను సందర్శించిన సీఎం చంద్రబాబు

యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా అందాలను వీక్షించింది. ఆకాశహర్మ్యం విశేషాలను తెలుసుకుంది. అంతకు ముందు యూఏఈలోని బిజినెస్‌ ఎమిరేట్స్‌ టవర్స్‌లో డీపీ వరల్డ్‌ గ్రూప్‌ చైర్మన్‌, సీఈవోతో చంద్రబాబు భేటీ అయ్యారు. రానున్న కాలంలో ఓడరేవు సరకు రవాణ యావత్తూ తూర్పుతీరం నుంచే జరుగుతుందని తెలిపారు. వాయువ్య ప్రాంతాల సరకు రవాణాను తూర్పు నౌకాశ్రయాలకు అనుసంధానించాల్సిన ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నౌకాశ్రయాలకు విస్తృత సేవలందించగల సామర్థ్యం, సత్తా ఉన్నాయన్నారు.