గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్ 2017 నిర్వహణ ఏర్పాట్ల పై సమీక్ష

గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్ 2017 నిర్వహణ ఏర్పాట్ల పై సమీక్ష

09-11-2017

గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్ 2017 నిర్వహణ ఏర్పాట్ల పై సమీక్ష

నవంబర్ 28 నుండి 30 తేదీలలో హైటెక్ సిటీ లో జరగబోయే గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్ కు వివిధ శాఖల అధికారులు టీమ్ వర్కు లాగా పనిచేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ ఆదేశించారు. ఆయన గురువారం సచివాలయంలో గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్ - 2017 నిర్వహణ ఏర్పాట్ల పై సమీక్షించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సును నిర్వహించే అవకాశం మన రాష్ట్రానికి వచ్చినందున మన ప్రతిభ ను చాటుకునేల పనిచేసి విజయవంతం చేయాలన్నారు.

ఈ సమావేశంలో పరిశ్రమలు , ఐ.టి. ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్ మెంట్  కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్ , హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి యోగిత రాణా, జి.హెచ్.యం. సి కమీషనర్ శ్రీ జనార్దన్ రెడ్డి, హెచ్. యం.డి.ఎ కమీషనర్ శ్రీ చిరంజీవులు , అడిషనల్ డి.జి.పి. శ్రీ అంజనీ కుమార్ , ఇంటిలిజన్స్ ఐ.జి. శ్రీ నవీన్ చంద్ , సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ సందీప్ శాండిల్య , మెట్రో రైల్ యం.డి. శ్రీ ఎన్.వి.ఎస్ రెడ్డి , ప్రోటోకాల్ డిప్యూటి సెక్రటరీ శ్రీ అరవిందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహణకు సబ్ కమిటీలు ప్రతి రోజు పనులను సమీక్షిస్తు, సమన్వయంతో మందుకు సాగాలన్నారు. సబ్ కమిటీలు అంతర్గతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. 

గ్లోబల్ ఎంట్ర్ ప్రెన్యుర్ సమ్మిట్ కు హజరయ్యే అతిధులకు అన్ని ఏర్పాట్లు చేయాలని, విమానాశ్రయంలో అతిధులకు వెల్ కమ్ కిట్స్ , ట్రావెల్ రూట్ మ్యాప్స్ , బస్సుల వరకు ఎస్కార్ట్ లకు వాలంటీర్లతో సహకారం అందెలా చూడాలన్నారు. ఈ సదస్సుకు వచ్చే అతిధులకు హోటళ్లలో తగు వసతి , బద్రత , రవాణా  ఏర్పాట్లు ఉండాలన్నారు.  హెచ్.ఐ.సి.సి లో కంట్రోల్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని ఆహ్వనితుల రిజిస్ట్రేషన్ కు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. 

ఈ సదస్సు కోసం నియమించిన వాలంటీర్లు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా పని చేయాలని అన్నారు. ఈ నెల 28 న ప్రారంభోత్స కార్యక్రమం వుంటుదని 29, 30 తేదీలలో ప్లీనరీ సెషన్ మరియు పానెల్ డిస్ కషన్ , వర్క్ షాప్ మానిటరింగ్ క్లాసులు వుంటాయని అన్నారు. 

Click here for PhotoGallery