ఇవాంకాకు ఘనంగా వీడ్కోలు
MarinaSkies
Kizen

ఇవాంకాకు ఘనంగా వీడ్కోలు

30-11-2017

ఇవాంకాకు ఘనంగా వీడ్కోలు

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ సలహాదారు ఇవాంకా ట్రంప్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ఇవాంకా హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని దుబాయ్‌ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా ఆమె హెచ్‌ఐసిసిలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌) లో ప్రధాని మోడీతో పాటు పాల్గొన్నారు. సదస్సులో ఆమె చేసిన ప్రసంగం పారిశ్రామికవేత్తలు ఆకట్టుకుంది. అతిధుల గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం తరపున ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చిన విందుకు ఆమె హజరయ్యారు. రెండవ రోజు చారిత్రాత్మక గొల్కోండ కోటను ఆమె సందర్శించారు. ఈ సందర్భగా ఆమెకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆమె రెండు రోజుల పాటు ట్రైడెంట్‌ హోటల్‌లో బస చేశారు. బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్ళారు.

Click here for Photogallery