ఏపీలో పెట్టుబడులకు ఎల్‌జీ ఆసక్తి

ఏపీలో పెట్టుబడులకు ఎల్‌జీ ఆసక్తి

07-12-2017

ఏపీలో పెట్టుబడులకు ఎల్‌జీ ఆసక్తి

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం ఎల్‌జీ సంస్థ ఆసక్తి కనబరిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడో రోజు పర్యటనలో భాగంగా సియోల్‌లో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ అధ్యక్షుడు సూన్‌ క్వోన్‌తోనూ ఇతర పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమయ్యారు. భారత్‌లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలేంటని సూన్‌ క్వోన్‌ చంద్రబాబుని అడిగారు. దేశంలో వ్యాపార అనుకూలతలున్న రాష్ట్రాల్లో తాము మొదటి స్థానంలో ఉన్నామని చంద్రబాబు తెలిపారు. కియో మోటర్స్‌ రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటు చేస్తోందని, ఫాక్స్‌కాన్‌ సంస్థ తమిళనాడుని వదిలి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిందని వివరించారు. స్టోరేజీ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో పెట్టుబడులకు తాము ఆసక్తిగా ఉన్నామని, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదనపై తమ బోర్డుతో చర్చిస్తామని సూన్‌ తెలిపారు. సౌర విద్యుత్‌ రంగంలో వివిధ దేశాలలో తమ సంస్థకు ప్రాజెక్టులు ఉన్నాయని, భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నామని ఓసిఐ కంపెనీ ఈసీఓ వుహ్యూమ్‌ లీ పేర్కొన్నారు.