విశాఖకు రాష్ట్రపతి రాక

విశాఖకు రాష్ట్రపతి రాక

07-12-2017

విశాఖకు రాష్ట్రపతి రాక

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు విశాఖకు రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం 2:20  గంటలకు ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. బీచ్‌రోడ్డులో టీయూ-142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఏయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈఎన్‌సీ మెస్‌లాన్స్‌కు చేరుకొని ఐఎన్‌ఎస్‌ కల్వరిపై ముద్రించిన స్టాంపును విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకానున్నారు.