15వ సాయంత్రం నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు
Ramakrishna

15వ సాయంత్రం నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు

07-12-2017

15వ సాయంత్రం నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు

ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం ఈ నెల 15న సాయంత్రం జరగనుంది. ఉదయం ప్రారంభించాలని తొలుత భావించారు. అదే రోజు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవడం, ముఖ్య అతిథి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభ ముగిసిన తర్వాత హైదరాబాద్‌ రానుండటంతో సాయంత్రం  ఆరంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగే మహాసభలకు 13వ తేదీ నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రధాన నిర్వాహక కమిటీ నిర్ణయించింది. గురువారం నుంచి వేదికల వద్ద పనులను ప్రారంభించాలని తీర్మానించింది.