రాజీవ్‌, నేను ఆ సినిమా చూశాం : సోనియా గాంధీ

రాజీవ్‌, నేను ఆ సినిమా చూశాం : సోనియా గాంధీ

07-12-2017

రాజీవ్‌, నేను ఆ సినిమా చూశాం : సోనియా గాంధీ

కొన్ని తరాలను తన అద్భుతమైన నటనతో అలరించిన బాలీవుడ్‌ ప్రముఖ నటుడు శశికపూర్‌ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శశికపూర్‌ కూతురు సంజనా కపూర్‌కి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. శశికపూర్‌కు తాను వీరాభిమానినని, తాను, రాజీవ్‌ కలిసి ఇంగ్లండ్‌లో తొలిసారి శశికపూర్‌ సినిమా చూశామని ఆ లేఖలో పేర్కొన్నారు. నేను మీ నాన్నకు వీరాభామానిని. శశికపూర్‌ నటించిన తొలి చిత్రం షేక్‌స్పియర్‌వాలా చూసి ఆయనకి వీరాభిమానిగా మారాను. ఆ సినిమా చూడడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. 1966లో ఇంగ్లండ్‌లో రాజీవ్‌ ఈ సినిమాకు నన్ను తీసుకెళ్లారు. ఆ తర్వాత శశి నటించిన చాలా సినిమాలు చూశాను. మధురమైన సినిమాలను మనకు కానుకగా అందించారు. ఆయన చనిపోయారని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయని  ఆ లేఖలో పేర్కొన్నారు.