పోలవరంపై రాజీపడే ప్రసక్తే లేదు

పోలవరంపై రాజీపడే ప్రసక్తే లేదు

07-12-2017

పోలవరంపై రాజీపడే ప్రసక్తే లేదు

పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఎక్కడ రాజీ పడేది లేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పనులు చేస్తున్నాం. ఏ విధంగా చేస్తే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందన్న దానిపై సమీక్షిస్తున్నాం. నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు ఆగే ప్రసక్తే లేదన్నారు. పవన్‌కల్యాణ్‌ పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తుంటే, వైకాపా ఎలా అడ్డుకోవాలా అని చూస్తోంది.