ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి

07-12-2017

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక బహుళ జాతి సంస్థలు ముందుకొస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దక్షిణకొరియా పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు. దక్షిణకొరియా అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. ఒకప్పుడు దక్షిణ కొరియా మనకన్నా పేద దేశమని, ఇప్పుడు దిక్షిణకొరియా తిరుగులేని శక్తిగా తయారైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్‌ రంగం వూపందుకుంటోంది. కియో మోటార్స్‌కు చెందిన అనుబంధ సంస్థలు రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. 37 కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో ఏపిఈడీబీ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ తీసుకుంది. దీనివల్ల రూ.3వేల కోట్ల పెట్టుబడులు, 7171 ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఏపీలో కొరియా ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకానుంది. బూసన్‌లో జరిగిన బిజినెస్‌ సెమినార్‌లో మేకిన్‌ ఇండియా కొరియా సెంటర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎంవోయూలో భాగంగా బూసన్‌లో ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ను నెలకొల్పుతాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎల్‌జీ సంస్థ ఆసక్తి చూపింది. మొత్తంగా రాష్ట్రానికి రూ.5వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి అని తెలిపారు.