ఏపీ టెట్‌ షెడ్యూల్‌ విడుదల
MarinaSkies
Kizen
APEDB

ఏపీ టెట్‌ షెడ్యూల్‌ విడుదల

13-12-2017

ఏపీ టెట్‌ షెడ్యూల్‌ విడుదల

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. పరీక్ష తేదీలతో సహా ఇతర షెడ్యూల్‌ను ఆయన ప్రకటించారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఈ నెల 18 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌ మౌక్‌ టెస్ట్‌ జనవరి 8వ తేదీన జరుగుతుంది. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ జనవరి 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఇక పరీక్షలు జనవరి 17వ తేదీ నుంచి 27 వరకు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇనిషియల్‌ కీ 29వ తేదీన విడుదల చేస్తారు. ఫైనల్‌ కీ ఫిబ్రవరి 6వ తేదీన ప్రచురిస్తారు. ఇక ఫైనల్‌ ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేస్తారు.