ప్రకాశం జిల్లా దర్శి జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు

ప్రకాశం జిల్లా దర్శి జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు

02-01-2018

ప్రకాశం జిల్లా దర్శి జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు

2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధిలోనే కాదు ఆనందంలోనూ నెంబర్‌ 1 రాష్ట్రంగా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కట్టుబట్టలతో నెత్తిన అప్పు పెట్టుకుని వచ్చామని, టెక్నాలజీ, అందుబాటులో ఉండే వనరులను ఉపయోగించుకుని నిలదొక్కుకున్నామని గుర్తు చేశారు. 2022 కి టాప్‌ 3 రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉంటుందన్నారు.

భారతదేశంలో రెండు అంకెల అభివృద్ధి జరిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని అన్నారు. ఎన్టీఆర్‌ భరోసా కింద పేదవాళ్లకు పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.5906 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. పిల్లల చదువులకు ఆర్థిక సాయం చేస్తున్నామన్న చంద్రబాబు, 57 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామనిచెప్పారు. స్కాలర్‌షిప్‌ డబ్బును నేరుగా విద్యార్థుల ఖాతాలో జమచేస్తున్నామని వెల్లడించారు. ఉగాది నుంచి పెళ్లికానుక పథకం అమలువుతుందనిన్నారు. పెళ్లికానుక పథకాన్ని డ్వాక్రా సంఘాల ద్వారానే అమలు చేస్తామని అన్నారు. రాబోయే రోజుల్లో లక్ష మంది పేదలకు వివాహాలు జరిపిస్తామన్న చంద్రబాబు పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదవిస్తామని వ్యాఖ్యానించారు.

Click here for Photogallery