ఎన్‌ఆర్‌ఐ పెండ్లిండ్లకు వెబ్‌సైట్‌

ఎన్‌ఆర్‌ఐ పెండ్లిండ్లకు వెబ్‌సైట్‌

03-01-2018

ఎన్‌ఆర్‌ఐ పెండ్లిండ్లకు వెబ్‌సైట్‌

ఎన్‌ఆర్‌ఐ పెండ్లిండ్ల రికార్డులు నిర్వహించేలా వెబ్‌సైట్‌ తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. భారతీయ మహిళలు ప్రవాస వరుడితో జరుగుతున్న అక్రమాలను కట్టడిచేసే విధంగా వెబ్‌సైట్‌ను అందుబాటులో తీసుకురానున్నది. దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌ఐ పెండ్లికొడుకుల వరకట్న వేధింపులు ఎక్కువవుతున్నాయి. వధువును ఇక్కడే వదలి వెళ్లటమో, లేక అక్కడ ఆమెకు పాస్‌పోర్టు ఇవ్వకుండా సతాయిస్తున్న కేసులు బోలేడు. వీటన్నింటికి కట్టడి చేసేలా మహిళాశిశు సంక్షేమశాఖ కొత్తగా ఓ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేస్తున్నది. ఇందులో ఎన్‌ఆర్‌ఐ పురుషుల జాబితాను సమకూరుస్తున్నారు. దేశంలో అని రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌ఐలు చేసుకునే వివాహాలు రిజిస్ట్రేషన్స్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే ఇంటి గ్రేటెడ్‌ నోడల్‌ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేసింది. 2015 నుంచి 3,328 వరకట్న వేధింపులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్రమంత్రి వీకేసింగ్‌ పార్లమెంటులో వెల్లడించారు.