కోడిపందేలపై సుప్రీంకోర్టు తీర్పు ఇదే

కోడిపందేలపై సుప్రీంకోర్టు తీర్పు ఇదే

12-01-2018

కోడిపందేలపై సుప్రీంకోర్టు తీర్పు ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల పందేలపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. సంక్రాంతి సందర్భంగా జరగనున్న కోడి పందేలపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. గత ఏడాది సుప్రీం ఇచ్చిన తీర్పే ఈసారి కూడా వర్తిస్తుందని చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ వెల్లడించింది. తనిఖీల పేరుతో పోలీసులు ప్రాంగణాల్లోకి, ఇళ్లలోకి వెళ్లి కోళ్లను పట్టుకోవద్దని, రైతులను అరెస్ట్‌ చేయవద్దని ధర్మాసనం సృష్టం చేసింది. హైకోర్టు తీర్పులో ఏమైనా మార్పులు కొరవచ్చని పిటిషనర్‌కు సుప్రీం కోర్టు సూచించింది. బీజేపీ నేత రఘరామకృష్ణం రాజు ఆశించిన విధంగానే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.