అనంతపురంలో ఐటీ పార్క్

అనంతపురంలో ఐటీ పార్క్

12-01-2018

అనంతపురంలో ఐటీ పార్క్

అనంతపురంలో ఐటీ పార్క్‌ నిర్మించబోతున్నామని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. యాష్‌ టెక్నాలజీస్‌ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ యాష్‌ టెక్నాలజీస్‌ క్లౌడ్‌ సర్వీసెస్‌, డేటా అనలిటిక్స్‌ అండ్‌ సైన్స్‌, సిస్టమ్‌ ఇంటిగ్రేషన్‌, టెస్టింగ్‌ సర్వీసులను అందిస్తుందని అన్నారు. ఏపీలో ఐటీ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై యాష్‌ టెక్నాలజీస్‌కు వివరించినట్లు తెలిపారు. డీటీపీ పాలసీ, ఇతరుల పాలసీలు, రాయితీల గురించి వివరించినట్లు చెప్పారు. కియా, అపోలో, హెచ్‌సీఎల్‌ లాంటి పెద్ద కంపెనీలు ఏపీకి వచ్చాయని, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు యాష్‌ టెక్నాలజీస్‌ అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు.