సీఎం చంద్రబాబు డైనమిక్ లీడర్ : కుంబ్లే

సీఎం చంద్రబాబు డైనమిక్ లీడర్ : కుంబ్లే

13-01-2018

సీఎం చంద్రబాబు డైనమిక్ లీడర్ : కుంబ్లే

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైనమిక్‌ లీడరని, ఏపీలో క్రీడల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే కొనియాడారు. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు అందరూ సహకరించాలని కుంబ్లే కోరారు. వివేకానందుడి జీవితం నేటి తరానికి మార్గదర్శకమని, వివేకానందుడు సూచించిన మార్గాన్ని యువత అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక వికాసాన్ని, క్రమశిక్షణను నేర్పుతాయని అన్నారు.