యువతకు ఆదర్శం స్వామి వివేకానంద : కొల్లు

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద : కొల్లు

13-01-2018

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద : కొల్లు

స్వామి వివేకానందను నేటి యువత ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆశయాలను, ఆకాంక్షలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా, యువజన, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో తెలుగునాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రవీంద్ర మాట్లాడుతూ యువత తలచుకుంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. స్వామి వివేకానందుకు చెప్పినవిధంగా ఇనుప కండలు, ఉక్కు నరాలు, దృఢ సంకల్పం గల యువత దేశాభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు. తాత, తండ్రుల స్ఫూర్తిని కొనసాగిస్తూ యువ మంత్రి నారా లోకేష్‌ రాజకీయల్లో, పాలనలో అద్భుతంగా రాణిస్తూ తన శాఖలకు అంతర్జాతీయంగా ఖ్యాతి తీసుకువస్తున్నారని కొనియాడారు.

పునర్విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్రకు వందలాది ఐటీ కంపెనీలను తీసుకురావడం ద్వారా లక్షలాది ఉద్యోగాలను యువతకు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. యువతకు పెద్దపీట వేస్తున్న టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో యూత్‌ పాలసీని తీసుకువచ్చిందని, దీని ద్వారా అన్ని రంగాల్లో వారు రాణించేలా ప్రత్యేక శిక్షణలను ఇవ్వడం జరుగుతోందన్నారు. క్రీడల్లో అంతర్జాతీయంగా రాణిస్తున్న యువతకు కూడా నగదు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ కొలువులను ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

Click here for Photogallery