నేడు వారావారిపల్లెకు సీఎం చంద్రబాబు

నేడు వారావారిపల్లెకు సీఎం చంద్రబాబు

13-01-2018

నేడు వారావారిపల్లెకు సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి పండుగ తన స్వగ్రామం నారావారిపల్లెలో జరుపుకోనున్నారు. నేడు సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు నారావారి పల్లెలోని స్వగృహానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన నారావారిపల్లెలో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. తన తల్లి దండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడు సమాధుల వద్ద పూజలు నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం వరకు ముఖ్యమంత్రి సొంత గ్రామంలోనే గడుపుతారు. సంక్రాంతి అనంతరం ఆయన ఈ నెల 16న అమరావతికి రానున్నారు.