ఘనంగా జన్మభూమి- మా ఊరు విజయోత్సవ సంబరాలు

ఘనంగా జన్మభూమి- మా ఊరు విజయోత్సవ సంబరాలు

13-01-2018

ఘనంగా జన్మభూమి- మా ఊరు విజయోత్సవ సంబరాలు

పది రోజులపాటు నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమం విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్వంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జాతీయ కార్యక్రమాల కమిటీ చైర్మన్‌, శాసనమండలి సభ్యులు వివివి చౌదరి కేట్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. అభివృద్దిని పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో పండుగ వాతావరణంలో ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల ఉత్సవంగా జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఏవి రమణ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నాదెండ్ల బ్రహ్మం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాయపాటి రంగబాబు, టీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర, తెలుగు యువత జల్లా అధ్యక్షుడు మల్లి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery