దావోస్ బయల్దేరిన సీఎం చంద్రబాబు

దావోస్ బయల్దేరిన సీఎం చంద్రబాబు

22-01-2018

దావోస్ బయల్దేరిన సీఎం చంద్రబాబు

దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన అక్కడినుంచి దావోస్‌కు వెళ్లనున్నారు. నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఈ నెల 26న అమరావతికి తిరిగి రానున్నారు. పర్యటనలో భాగంగా జ్యురిక్‌-అమరావతి నగరాల మధ్య సిస్టర్‌ సిటీ ఒప్పందం, హిటాచీ సంస్థ, ఫ్రాన్‌హోఫర్‌ అసోసియేషన్‌తో మూడు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. పలు అంతర్జాతీయ సంస్థల సీఈవోలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులతో సమావేశమవనున్నారు. ఏపీ లాంజ్‌లో ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు.