హైదరాబాద్ విద్యార్థినికి అరుదైన అవకాశం

IIIT Hyderabad student bags prestigious internship at Berkeley Lab

అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన లారెన్స్‌ బర్క్‌లీ నేషనల్‌ ల్యాబరేటరీలో ఇంటర్న్‌షిప్‌ చేసే అరుదైన అవకాశాన్ని ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ విద్యార్థిని స్నేహజైన్‌ దక్కించుకున్నారు. ఈ ల్యాబ్‌లో ఇంటర్న్‌షిప్‌ కోసం దేశ వ్యాప్తంగా వేలాది మంది పోటీపడగా 12 మందికి మాత్రమే అవకాశం దక్కింది. ఐఐఐటీహెచ్‌ నుంచి స్నేహజైన్‌ ఒక్కరే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ ప్రాంతానికి చెందిన ఆమె ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అదే రంగంలో పరిశోధన అంశంపై పీజీ చదువుతున్నారు. భవన నిర్మాణంలో గాజు వినియోగం అనే సరికొత్త విధానంపై పరిశోధన చేస్తుండటం తనకు ఈ అవకాశం పొందేందుకు ఉపయోగపడిందని స్నేహ చెప్పారు.

 


                    Advertise with us !!!