భారత్ అంటేనే బిజినెస్ : మోదీ

భారత్ అంటేనే బిజినెస్ : మోదీ

23-01-2018

భారత్ అంటేనే బిజినెస్ : మోదీ

భారత్‌ అంటేనే బిజినెస్‌ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ సీఈఓలతో సమావేశమయ్యారు. భారత ఆర్థిక ప్రగతి రిపోర్ట్‌ను ప్రధాని మోదీ టాప్‌ సీఈవోలకు తెలియజేశారు. వాణిజ్యం చేయాలనుకున్న వారికి భారత్‌లో మంచి అవకాశాలున్నాయన్నారు. ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 40 మంది సీఈఓలు, భారత్‌కు చెందిన 20 మంది సీఈఓలు, ప్రభుత్వ అధికారులు విజయ్‌ గోఖలే, జై శంకర్‌, రమేశ్‌ అభిషేక్‌లు హాజరయ్యారు. మోదీ భారత అభివృద్ది గురించి, ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారానికున్న మంచి అవకాశాల గురించి దావోసలో వివరించారని సీఈఓలతో సమావేశం అనంతరం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ తెలిపారు.