భారతీయులకు గర్వకారణం

భారతీయులకు గర్వకారణం

24-01-2018

భారతీయులకు గర్వకారణం

ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందని, అది ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. ప్రపంచ దేశాలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత్‌ శక్తిసామర్థ్యాలను, ఆకాంక్షలను దావోస్‌ వేదికగా మోదీ చక్కగా చెప్పారని ఆయన ప్రశంసించారు. మొత్తం ప్రపంచతంతటికీ భారత్‌ వినూత్నమైన అవకాశాలు కల్పిస్తుంది. సంపద, సౌభాగ్యం, ఆరోగ్యం, శాంతి అభివృద్ధిలు అందిస్తుంది. మన వేదాలు, పురాణాలు వేల సంవత్సరాల క్రితమే వసుదైక కుటుంబ స్ఫూర్తిని చాటిచెప్పాయి అని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.