ఉత్సాహంగా 'వాక్‌ విత్‌ జగనన్న'

ఉత్సాహంగా 'వాక్‌ విత్‌ జగనన్న'

29-01-2018

ఉత్సాహంగా 'వాక్‌ విత్‌ జగనన్న'

ఢిల్లీలో ఎంపీలు సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏపీ భవన్ నుంచి పండిట్ రవిశంకర్ శుక్లా లేన్ వరకు పాదయాత్ర చేశారు.  ప్రజాసంకల్పయాత్రలో జగన్ లక్షల మందితో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.  జగన్ దృష్టికి తెచ్చిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని పేర్కొన్నారు. ప్రజాభివృద్ధి అంశాలు వదిలిపెట్టి అసెంబ్లీ సీట్ల కోసం టీడీపీ కేంద్రాన్ని అడగడం విడ్డూరమని, ఫిరాయింపుల ప్రోత్సహానికే సీట్ల పెంపు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భం‍గా ఏపికి ప్రత్యేక హోదా, పోలవరం, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ అంశాలు పార్లమెంటులో లేవనెత్తుతామని మరోసారి గుర్తు చేశారు.