విజయవాడ టు కడప ట్రూజెట్

విజయవాడ టు కడప ట్రూజెట్

09-02-2018

విజయవాడ టు కడప ట్రూజెట్

విజయవాడ నుంచి కడపకు నేరుగా విమానాలను నడపాలని ట్రూజెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 1వ తేదీ నుంచి కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నామని ప్రారంభ ఆఫర్‌ గా రూ.798కే విమాన ప్రయాణం చేయవచ్చని తెలిపింది. ప్రతి రోజు ఉదయం 8.05 గంటలకు విజయవాడలో బయలుదేరే విమానం కడపకు 9.10కి చేరుతుందని, తిరిగి 9.40కి కడప నుంచి టేకాఫ్‌ అయి, విజయవాడకు 10.45కు వస్తుందని ఒక ప్రటకనలో తెలిపింది. తాము ఇప్పటికే కడప నుంచి హైదరాబాద్‌, చెన్నైలకు విమానాలు నడుపుతున్నామని గుర్తు చేసిన సంస్థ, ఇప్పుడు విజయవాడకూ ప్రారంభించామని పేర్కొంది. చిన్న పట్టణాలకు కూడా విమానయానాన్ని దగ్గర చేయాలన్న కేంద్రం ఆలోచనకు అనుగుణంగా తమ సర్వీసులను పెంచుకుంటూ వెళుతున్నామని తెలిపింది.