ఏపీ ఎంపీల ఆందోళనకు మద్దతిస్తున్నాం : కవిత

ఏపీ ఎంపీల ఆందోళనకు మద్దతిస్తున్నాం : కవిత

09-02-2018

ఏపీ ఎంపీల ఆందోళనకు మద్దతిస్తున్నాం : కవిత

విభజన హామీలన్నీ నెరవేర్చాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ ఏదో ఒక ప్రభుత్వం వస్తూనే ఉంటుందని, కానీ ఏపీ, తెలంగాణలకు  ఇచ్చిన హామీలు తీర్చాలన్నారు. లోక్‌సభలో ఆమె మాట్లాడారు. రెండు మూడు రోజులుగా ఏపీకి చెందిన టీడీపీ ఎంపీలు, వైకాపా ఎంపీలు ఆందోళన చేస్తున్నారని, వారికి మద్దతు తెలుపుతున్నామని కవిత పేర్కొన్నారు. మిత్రపక్షంగా ఉండి ఆందోళన చేస్తున్నారంటే దేశానికే చెడు సంకేతాలు వెళ్తాయని, ఈ అంశంపై త్వరగా మాట్లాడాలని కేంద్రానికి సూచించారు.