రేణుకా చౌదరి సంచలన నిర్ణయం
Nela Ticket
Chal Mohan Ranga
Kizen
APEDB

రేణుకా చౌదరి సంచలన నిర్ణయం

09-02-2018

రేణుకా చౌదరి సంచలన నిర్ణయం

కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు శూర్ఫణఖ్ణ పోస్టుకు ఆమె నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రాజ్యసభలో ఆమె హక్కుల తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. పార్లమెంటులో ప్రధాని మోదీ, రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తదనంతర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్‌ రిజిజు వివాదాస్పద పోస్టు ఫేస్‌బుక్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. రామాయణం సీరియల్‌లోని శూర్ఫణఖ పాత్ర నవ్వుతున్న వీడియోకి, మోదీ మాట్లాడిన సమయంలో రేణుకా చౌదరి నవ్వుతున్న దృశ్యాలను ఆయన జత చేశారు. దీనిపై రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో తన నవ్వుపై మోదీ వ్యాఖ్యలను జతచేస్తూ, రిజిజు వీడియో పోస్టుపై హక్కుల తీర్మానం ఆమె ప్రవేశపెట్టారు. ఇది ఓ మహిళను అవమానించడమే కాదు, తీవ్ర అభ్యంతరకరం కూడా, దీనిపై నేను హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాను అని రేణుకా చౌదరి పేర్కొన్నారు.