అక్కడ పర్యటించే తొలి ప్రధాని మోదీనే

అక్కడ పర్యటించే తొలి ప్రధాని మోదీనే

09-02-2018

అక్కడ పర్యటించే తొలి ప్రధాని మోదీనే

పాలస్తీనాలో పర్యటించే తొలి భారత ప్రధానిగా నరేంద్రమోదీ చరిత్రలో నిలిచిపోనున్నారు. నేటి నుంచి మూడు దేశాల పర్యటన ప్రారంభంకానుంది. పాలస్తీనాను సందర్శించడం చారిత్రాత్మకం అని ప్రధాని ఒక ప్రకటనలో తెలిపారు. ఇజ్రాయెల్‌ పర్యటించిన ఆరు నెలల తర్వాత ఇక్కడ పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకొంది. పాలస్తీనా ప్రెసిడెంట్‌ మహ్మద్‌ అబ్బాస్‌తో ద్వైపాక్షిక చర్చల అనంతరం యూఏఈలో ఆదేశ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌తో సమావేశమవుతారు. యూఏఈకి వెళ్తుండటం రెండోసారి కాగా ఒమెన్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. వచ్చే సోమవారం మోదీ పర్యటన ముగుస్తుంది.