రాష్ట్రపతితో కేటీఆర్ భేటీ
Sailaja Reddy Alluddu

రాష్ట్రపతితో కేటీఆర్ భేటీ

09-02-2018

రాష్ట్రపతితో కేటీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నెల 19 నుంచి 21 వరకు జరుగనున్న వరల్డ్‌ ఐటీ కాంగ్రెస్‌ 2018 సదస్సు ముగింపు వేడుకలకు రావాలని రాష్ట్రపతిని కేటీఆర్‌ ఆహ్వానించారు. కాగా, నాస్కామ్‌ ఆధ్వర్యంలో జరుగనున్న ఐటీ కాంగ్రెస్‌ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్‌ ద్వారా ప్రారంభించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 మంది పారిశ్రామిక వేత్తలు హాజరు కానున్న ఈ సమావేశంలో మొత్తం 50 సెషన్లు జరగనున్నాయి. మొత్తం 30 దేశాల నుంచి ఆహ్వానితులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.