అమరావతికి తరలివస్తోన్న పరిశ్రమలు

అమరావతికి తరలివస్తోన్న పరిశ్రమలు

12-02-2018

అమరావతికి తరలివస్తోన్న పరిశ్రమలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతికి తరలివస్తున్న పరిశ్రమల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. విభజన తర్వాత రాష్ట్రానికి తరలిరావాలన్న ఆకాంక్ష మేరకు హైదరాబాద్‌, జీడీమెట్ల, నాచారం ప్రాంతానికి చెందిన ఏపీ పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా బాపులపాడులోని మల్లవెల్లి పారిశ్రామిక క్లస్టర్‌లో 400కు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. తొలిదశలో 216 పరిశ్రమలకు ప్రభుత్వం భూములు కేటాయించింది. రూ.800 కోట్లతో రానున్న ఈ పరిశ్రమలు ప్రాథమికంగా 7,250 మందికి ప్రత్యక్షంగా, ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయని మల్లెపల్లి సహయ కార్యదర్శి జీఎన్‌బీ చౌదరి తెలిపారు.