ఈ నెల 17న జేఎన్టీయూకే నిర్మాణానికి శంకుస్థాపన

ఈ నెల 17న జేఎన్టీయూకే నిర్మాణానికి శంకుస్థాపన

12-02-2018

ఈ నెల 17న జేఎన్టీయూకే నిర్మాణానికి శంకుస్థాపన

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామంలో జేఎన్‌టీయూకే ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన మూహూర్తం కుదిరింది. మూడేళ్ల క్రితమే మంజురైన ఈ సంస్థ నిర్మాణానికి ఎన్నో ఆటంకాలు తలెత్తగా వాటిన అధిగమించిన ప్రభుత్వం ఈ నెల 17న భూమిపూజ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌కు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.