వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సమావేశాన్ని ప్రారంభించిన మోదీ

వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సమావేశాన్ని ప్రారంభించిన మోదీ

19-02-2018

వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సమావేశాన్ని ప్రారంభించిన మోదీ

ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభించడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌ వేదికగా మూడురోజుల పాటు జరగనున్న ఐటీ కాంగ్రెస్‌ సదస్సును ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు భారత్‌, హైదరాబాద్‌ ఆహ్వానం పలుకుతోందన్నారు. ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. డిజిటల్‌ సాంకేతిక ఆవిర్భావానికి, నూతన ఆవిష్కరణలకు భారత్‌ ప్రధాన కేంద్రమని అన్నారు. దేశంలో లక్ష గ్రామాలను ఆప్టికల్‌ ఫైబర్‌తో అనుసంధానించామని ఆయన వెల్లడించారు. డిజిటల్‌ ఇండియా దిశగా కొనసాగుతోన్న మా ప్రయాణం, కేవలం ప్రభుత్వంతోనే సాధ్యమయ్యే పని కాదన్నారు. ప్రజల బాగస్వామ్యం కూడా అవసరమన్నారు. 320 మిలియన్ల్‌ జన్‌ధన్‌ ఖాతాల ద్వారా రూ.57 వేల కోట్లు ప్రభుత్వానికి ఆదా అయిందని గుర్తు చేశారు. దేశంలో 60 మిలియన్ల మందిని డిజిటల్‌ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. డిజిటల్‌ లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి చాలా నిధులు మిగులుతున్నాయని మోదీ సృష్టం చేశారు.