చర్చలకు రావాలని ఎపి సిఎస్ కు పిలుపు

చర్చలకు రావాలని ఎపి సిఎస్ కు పిలుపు

20-02-2018

చర్చలకు రావాలని ఎపి సిఎస్ కు పిలుపు

ఎపి విభజన సమస్యలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలకు రావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎపి సిఎస్‌)కి కేంద్రంనుంచి పిలుపు వచ్చింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ నెల 23వ తేదీన జరుగనున్న ఈ సమావేశంలో ప్రధాని కార్యాలయం, రైల్వే బోర్డు అధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రైల్వే జోన్‌, ఆర్థిక లోటు, కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు అంశాలపై చర్చిస్తారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతిపాదనలు, స్టేటస్‌ రిపోర్టుతో రావాలని ఎపి సిఎస్కు కేంద్రం సూచించింది. అలాగే తొమ్మది, పదవ షెడ్యూళ్లలోని సంస్థల విభజనపై కూడా చర్చిస్తారు. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు కూడా హాజరవుతారు.