కువైట్ కు వెళ్తున్న ఎన్నారై మంత్రి

కువైట్ కు వెళ్తున్న ఎన్నారై మంత్రి

20-02-2018

కువైట్ కు వెళ్తున్న ఎన్నారై మంత్రి

కువైట్‌లో అనధికారికంగా నివసిస్తున్న ప్రవాసులు ఎలాంటి జరిమానా చెల్లించనవసరం లేకుండా అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ప్రకటించడంతో వారిని రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వారికి తక్షణ సహాయం అందించి స్వదేశానికి తీసుకువస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడారు. కువైట్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడంతో సుమారు 5వేల మంది ప్రవాసాంధ్రులు స్వరాష్ట్రానికి వస్తారన్నారు. రాష్ట్రానికి తిరిగి వచ్చే ప్రవాసులకు ఏపీ ఎన్నార్టీ సొసైటీ, రాష్ట్ర నైపుణ్యాభివ ద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. శిక్షణకు హాజరయ్యే వారికి 3నెలలపాటు జీవన భ తి ఇస్తామని తెలిపారు. కువైట్‌ నుంచి తిరిగి వచ్చే ప్రవాసాంధ్రులు రిజిస్ట్రేషన్‌ కోసం ఏపీఎన్నార్టీ హెల్ప్‌లైన్‌ నంబరు 0091863-2340678, లేదా వాట్యాప్‌ నెంబరు 00918500027678, వెబ్‌సైట్‌: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎన్‌ఆర్‌టీ.కామ్‌/కేయూడబ్ల్యూఏటీ ద్వారా సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు.