కేంద్రంలో కదలిక వచ్చిందా?

కేంద్రంలో కదలిక వచ్చిందా?

20-02-2018

కేంద్రంలో కదలిక వచ్చిందా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి, పార్లమెంటులో టీడీపీ ఎంపీల నిరసనలతో కేంద్రంలో కదలిక వచ్చిందా? రాష్ట్రానికి చేయాల్సిన సాయంపై సానుకూల నిర్ణయం తీసుకునే దిశగా మోదీ ప్రభుత్వం ముందడగు వేస్తోందా? తాజా పరిణామాలు ఈ సంకేతాలను ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం (ఈ నెల 23న) కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఏపీకి చేయాల్సిన ఆర్థిక సాయం ఏమిటి? ఇంతవరకు కేంద్రం ఏం చేసింది. ఇంకేం చేయగలమో తేల్చేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి కేంద్ర హోం శాఖకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఆ మేరకు ఆవసరమైన కసరత్తు చేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తమ శాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబను నిర్దేశించారు. దీంతో ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, విభజన వ్యవహారాల కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర, మౌలికవసతులు, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ తదితరులు హాజరుకానున్నారు.