సోనియా విందుకు టీడీపీ?

సోనియా విందుకు టీడీపీ?

08-03-2018

సోనియా విందుకు టీడీపీ?

కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీ ఈ నెల 13న యుపిఎ మిత్ర పక్షాలకు విందు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్‌ ప్రతినిధి తెలిపారు. ఈ విందుకు భాగస్వామ్య పక్షాలతో పాటు తెలుగుదేశం పార్టీకి కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. బ్యాంక్‌ కుంభకోణాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ సంక్షోభం వంటి అంశాలపై ఈ విందు సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. థర్డ్‌ ఫ్రంట్‌, ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో యుపిఏను పట్టిష్టపరుచుకోవడంలో భాగంగానే ఈ విందు ఇవ్వనుండటం గమనార్హం.