దేశంలోనే ధనిక ఎంపీ ఎవరో తెలుసా?

దేశంలోనే ధనిక ఎంపీ ఎవరో తెలుసా?

13-03-2018

దేశంలోనే ధనిక ఎంపీ ఎవరో తెలుసా?

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సతీమణి, నటి జయా బచ్చన్‌ రాజ్యసభ ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తున్నారు. ఆమె సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తరపున ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి మరోసారి పెద్దల సభకు బరిలో నిలిచారు. ఈ సందర్భంగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. ఆమె పేరిట రూ.1000కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించారు. ఆమె రాజ్యసభకు ఎంపికైతే అత్యంత ధనిక ఎంపీగా నిలవనున్నారు. 2014లో బీజేపీ తరపున రాజ్యసభకు ఎంపికైన రవీంద్ర కిశోర్‌ సిన్హా రూ.800 కోట్ల ఆస్తితో ప్రస్తుతం అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.

ఎస్పీ నుంచి రాజ్యసభ ఎంపీ రేసులో ఉన్న జయ 2012లో పోటీ చేసినప్పుడు ఆమె ఆస్తుల విలువ రూ.493 కోట్లున్నట్లు గతంలో వెల్లడించారు. 2012లో కలిగి ఉన్న వారి ఆస్తుల విలువ ప్రస్తుతం రెండు రెట్లు పెరిగాయి. అమితాబ్‌, జయ దగ్గరున్న వాచ్‌ల విలువ వరుసగా రూ.3.4 కోట్లు, రూ.51 లక్షల్నుట్లు పేర్కొన్నారు. ఫ్రాన్స్‌లోని బ్రిజ్‌నొగాన్‌ ప్లేజ్‌లో బచన్‌ కుటుంబానికి 3,175 స్కేర్‌మీటర్ల రెసిడెన్సియల్‌ ప్రాపర్టీ ఉన్నట్లు వివరించారు. అంతేగాక దేశంలోని ప్రముఖ నగరాలు నోయిడా, భోపాల్‌, పుణె, అహ్మదాబాద్‌, గాంధీనగర్‌లో ప్రాపర్టీలున్నాయి.